క్రైమ్/లీగల్

కోటంరెడ్డి అరెస్టు.. బెయిల్‌పై విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు రూరల్ : నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీఓ సరళ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసిన సంఘటనలో అధికార పార్టీ వైసీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను జడ్జి ముందు ప్రవేశపెట్టగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శనివారం అర్ధరాత్రి అదే కేసులో మరో వ్యక్తి శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి, రూరల్ ఎమ్మెల్యే నివాసముంటున్న ఇంటి వద్దకు రూరల్ డిఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చేరుకున్నారు. ఆ సమయంలో
ఎమ్మెల్యే నిద్రిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేయడంతో అక్కడే వేచి ఉన్న పోలీసులు వేకువజామున నాలుగు గంటలకు ఆయనను కలిశారు. ఎంపిడిఓ సరళ కేసులో మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామంటూ పోలీసులు చెప్పి అక్కడ నుండి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం రూరల్ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి అక్కడ నుండి కోర్టుకు తరలించారు. ఎమ్మెల్యేకు సంబంధించిన లాయర్ బెయిల్ పేపర్స్ సిద్ధం చేసుకుని కోర్టుకు అందించగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మొత్తంమీద అధికార పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేయడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

*చిత్రం...నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు