క్రైమ్/లీగల్

ప్రేమోన్మాది ఘాతుకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి : ప్రేమోన్మాది ఘాతుకానికి డిగ్రీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయన సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గుత్తి పట్టణంలోని తురకపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న జీపు డ్రైవర్ రాజు కుమార్తె జ్యోత్స్న అరుణకుమారి (19) శ్రీసాయి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె ఇంటర్మీడియట్ చదువుతుండగా జక్కలచెరువు గ్రామానికి చెందిన రంగస్వామితో సన్నిహితంగా ఉండేది. ఇంటర్ పూర్తి చేసుకున్న జ్యోత్స్న, రంగస్వామి ఆ తర్వాత ఎంఎస్ డిగ్రీ కళాశాలలో చేరారు. అయితే కొన్ని రోజుల తర్వాత (డిగ్రీ మొదటి సంవత్సరంలోనే) జ్యోత్స్న ఇక్కడి నుంచి టీసీ తీసుకుని శ్రీసాయి డిగ్రీ కళాశాలలో చేరింది. అక్కడ ఆమె మరొకరితో చనువుగా వుండడాన్ని గమనించిన రంగస్వామి జ్యోత్స్నను హెచ్చరించాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదన్న అనుమానంతో శనివారం రాత్రి జ్యోత్స్నకు ఫోన్ చేసి బయటకు రావాలని కోరాడు. రాత్రి 9.30 గంటల సమయంలో జ్యోత్స్న ఇంటి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ఇంటి వద్ద కూర్చుని వారిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాట పెరిగింది. ఆగ్రహానికి గురైన రంగస్వామి పక్కనే వున్న వైరుతో జ్యోత్స్న మెడకు ఉచ్చు బిగించి హత్య చేసి పరారయ్యాడు. కాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె తండ్రి రాజు చుట్టుపక్కల వెతికాడు. నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద విగత జీవిగా పడి ఉండడంతో తండ్రి రాజు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం కోసం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల అదుపులో నిందితుడు..
జ్యోత్స్న అరుణకుమారి హత్య కేసులో నిందితుడైన రంగస్వామిని గుత్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తనతో రెండేళ్ల క్రితం అత్యంత చనువుగా ఉన్న అరుణకుమారి గత కొంతకాలంగా తనను దూరం పెడుతున్నందు వల్లే ఆగ్రహానికి గురై జ్యోత్స్నను హత్య చేశానని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు తెలిసింది.

*చిత్రం...హత్యకు గురైన జ్యోత్స్న అరుణకుమారి