క్రైమ్/లీగల్

ఈఎస్‌ఐ కుంభకోణంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఈఎస్‌ఐ కుంభకోణం కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన పద్మకు చెందిన బినామీ కంపెనీలను ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న బాలానగర్‌లోని వెంకటేశ్వర హెల్త్ సెంటర్ యజమాని అరవింద్ రెడ్డిని అధికారులు అరెస్టు చేశారు. వైద్య శిబిరాల పేరుతో భారీగా మందులు, పరికరాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అరవింద్ విక్రయించిన్నట్లు ఏసీబీ అదికారులు తెలిపారు. ఈఎస్‌ఐ జాయింట్ డైరెక్టర్ పద్మతో కలిసి అరవింద్‌రెడ్డి అక్రమాలు పాల్పడ్డారని, ఆమె తల్లి పేరుతో అరవింద్ రెడ్డికి కంపెనీలు కూడా ఉన్నట్లు గుర్తించారు. బాలానగర్, దూలపల్లిలోని 3 కంపెనీలు, సుచిత్రలోని అరవింద్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈఎస్‌ఐ స్కాంలో ఇప్పటి వరకు తొమ్మిది మందిని ఏసీబి అరెస్టు చేసింది.