క్రైమ్/లీగల్

అఖిల ప్రియ భర్త భార్గవ్‌పై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, అక్టోబర్ 9: ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్తపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైయింది. గచ్చిబౌలి పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. ఆళ్లగడ్డ రూరల్ పోలీసు స్టేషన్ పరిధికి సంబంధించిన రెండు కేసులకు సంబంధించి భార్గవ్ రామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసులను దర్యాప్తు చేస్తున్న ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేష్ కుమార్ విచారణ నిమిత్తం భార్గవ్‌ని ఎన్ని సార్లు పోలీసు స్టేషన్‌కు పిలిచిన రాక పోగా, తప్పించుకుని తిరుగుతున్నాడు.
గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని నానాక్‌రాంగూడ కపిల్ టవర్‌లో ఉన్నట్లు ఆళ్లగడుడ్డ పోలీసులకు సమాచారం రావడంతో రమేష్ కుమార్ గచ్చిబౌలికి వచ్చాడు. కపిల్ టవర్‌లో తలదాచుకుంటున్న భార్గవ్‌ని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లాగా పోలీసులను చూసి కారులో పారీపోతుండగా ఎస్‌ఐ అపేందుకు ప్రయత్నించాడు. కారు అపినట్లే ఆపి కారుతో తమపైకి పోనిచ్చాడాని గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తమ విధులకు ఆటక పరచడంతో పాటు కారుతో గుద్దే ప్రయత్నం చేశాడని భార్గవ్‌పై ఎస్ ఐరమేష్ కుమార్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ ఎస్‌ఐ రమేష కుమార్ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.