క్రైమ్/లీగల్

రవిప్రకాష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారం నాటికి వాయిదా పడింది. ఆయనను విచారణ నిమిత్తం పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో పక్క రవిప్రకాష్ న్యాయవాదులు బెయిల్ కోరుతూ వేరే పిటిషన్‌ను దాఖలు చేశారు. టీవీ-9 చేసిన ఫిర్యాదులపై
గతంలోనే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని రవిప్రకాశ్ తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. కాగా, తమ వాదనలను గురువారం వినిపిస్తామని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తదుపరి వాదనలకు కేసును గురువారానికి వాయిదా వేసింది.