క్రైమ్/లీగల్

స్వేచ్ఛగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హుజూర్‌నగర్ ఎన్నిక స్వేచ్ఛగా జరిగేలా చూడాలని రాష్ట్ర హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికపై తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్‌కుమార్ హైకోర్టులో బుధవారం నాడు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను ఎన్నికల ప్రచారం చేసుకోనివ్వకుండా పోలీసులు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన పిటిషన్‌లో ఆరోపించారు. మూడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని నవీన్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా అడ్డుపడుతున్నారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రచారం నిర్వహించుకునేందుకు వీలు కల్పించాలని అడిగారు. ప్రతివాదులుగా ఎన్నికల కమిషన్‌ను, హోం శాఖ ముఖ్యకార్యదర్శిని, సూర్యాపేట జిల్లా ఎస్పీని,
హుజూర్‌నగర్ ఎస్‌ఐసీ చేర్చారు. దీనిపై బుధవారం సాయంత్రం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ. రాజశేఖర్ రెడ్డి ఇరు వర్గాల వాదనలు విన్నారు. అభ్యర్ధి ఎన్నికల ప్రచారానికి ఎలాంటి ఆటంకం కలిగించవద్దని ఆదేశించారు. ఎన్నికల నియమనిబంధనల మేరకే అధికారులు వ్యవహరించాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొన్న న్యాయమూర్తి తదుపరి విచారణను 18వ తేదీకి వాయిదా వేశారు. పిటిషనర్ తరఫున పీవీజీ ఉమేష్ చంద్ర, ఎన్నికల కమిషన్ తరఫున పాలెం అఖిల, అవినాష్‌దేశాయ్, పోలీసు అధికారుల తరఫున హోం శాఖ కౌన్సిల్ టీ. శ్రీకాంత్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. అవసరమైన అనుమతులు పొందినపుడు అభ్యర్ధులు ప్రచారం చేసుకోవచ్చని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ప్రచారం కోసం నిర్దిష్టమైన అనుమతి పొందాల్సి ఉంటుందని హోం శాఖ కౌన్సిల్ తమ వాదనలు వినిపించారు.