క్రైమ్/లీగల్

రేషన్ బియ్యం అక్రమార్కుల గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, అక్టోబర్ 9: తాండూరు పట్టణ పరిసరాలలో ప్రభుత్వ ప్రజా పంపిణీ రేషన్ బియ్యం అక్రమంగా తరలించి లక్షలు గడిస్తున్న అక్రమార్కుల గుట్టురట్టయింది. గత సోమవారం నుండి పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు చంద్రవౌళి స్థానిక పోలీస్ అధికారుల సహయంతో ప్రజా పంపిణీ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయటంతో పాటు, తాండూరు పరిసరాల నుంచి వందల బస్తాల రేషన్ బియ్యాన్ని రహాస్య ప్రదేశాలలో నిల్వ ఉంచి పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్టక్రు తరలిస్తున్నట్లు అందిన విశ్వాసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన వడ్డె వెంకటయ్య అనే వ్యక్తి పట్టణంలోని చించోళ్లీ రమదారిలో ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంకు వెనక ఎన్న ఓక ఇంటిలో 300ల క్వింటాళ్ల రేషన్ బియ్యంతో పాటు, 150 క్వింటాళ్ల దొడ్డు బియ్యం, మరో 100 క్వింటాళ్ల బియ్యం నూకలు దాచి అక్రమంగా పక్క రాష్ట్రాకు తరలించి ప్రతి నెలా లక్షల రూపాయలు అక్రమంగా గడిస్తున్నట్లు పౌర సరఫరాల విజిలెన్స్ అధికారి చంద్రవౌళి బుధవారం సాయంత్రం వివరించారు. చెంగోల్ గ్రామస్థుడయిన వడ్డె వెంకటయ్య గత కొంత కాలంగా రేషన్ బియ్యాన్ని కొంత మంది రేషన్ డీలర్ల నుంచి సేకరించి వందల క్వింటాళ్లు పోగు చేసి తరలిస్తున్నట్లు తమ తనఖీల్లో గ్రహించామన్నారు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న కొంత మంది రేషన్ డీలర్ల వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఈసందర్భంగా విజిలెన్స్ అధికారి చంద్రవౌళి వెల్లడించారు. కాగా తాండూరు డివిజన్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారాలు పూర్తి స్థాయిలో వెలికి తీసీ సంబంధిత అక్రమార్కులను చట్ట రంగా శిక్షించటం జరగుతుందన్నారు. ఇప్పటికే చెంగోల్ గ్రామానికి చెందిన వడ్డె వెంకటయ్య పై కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు విజిలెన్స్ అధికారి చంద్రవౌళి, తాండూరు రూరల్ సర్కిల్ సీఐ. డీ.జలంధర్ రెడ్డి తెలిపారు.