క్రైమ్/లీగల్

ఏటీఎం కేంద్రాల వద్ద మాటేసి ఖాతాదారుల నగదు స్వాహా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 9: ఏటీఎం కేంద్రాల వద్ద మాటువేసి ఖాతాదారులను మోసగిస్తున్న కేసులో పాత నేరస్తుడిని సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి ఏడు కేసుల్లో 79,050 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కృష్ణానగర్‌కు చెందిన పేరేపి మధుసూదన్ అలియాస్ మధు(25) అనే పాత నేరస్తుడు సీఏ వరకు చదువుకున్నాడు. చెన్నైలో చదువుకునే సమయంలో ఆన్‌లైన్ రమీ పేకాట ఆడేవాడు. ఆ సమయంలో పేకాటలో 2లక్షలు నగదు పోగొట్టుకున్నాడు. చెన్నై నుంచి నెల్లూరుకు చేరి తన ఇంట్లో నగదు, బంగారం చోరీ చేశాడు. ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి ఆ నగదుతో మళ్లీ ఆన్‌లైన్ రమీ ఆడేవాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ఈ ఏడాది అక్కడి నుంచి విజయవాడ మకాం మార్చి తన సోదరుని స్నేహితుని వద్ద చేరాడు. సింగ్‌నగర్, పైపుల రోడ్డులో ఉంటున్న రూములో ఉంటూ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో చేరి ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో డబ్బు కోసం ఏటీఎం కేంద్రాల వద్ద మాటువేశాడు. అక్కడికి వచ్చే ఖాతాదార్లలో వృద్ధులు, తెలియని వారిని లక్ష్యంగా చేసుకుని వారికి నగదు విత్‌డ్రా విషయంలో సహకరిస్తున్నట్లు నటిస్తాడు. ఏటీఎం కార్డు 16 అంకెల నెంబర్ తన ఫోన్‌లో ఫీడ్ చేసుకుని కార్డు వెనుక ఉండే సీవీవీ నెంబర్, కార్డు కాలపరిమితి తేదీని తన రమీ ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తాడు. వారికి ఓటీపీ రాగానే తన ఫోన్‌లో ఎంటర్ చేసుకుని ఎంతకావాలో అంత నగదు వారి ఖాతాల నుంచి రమీ ఎకౌంట్‌కు బదిలీ చేసేవాడు. ఈక్రమంలో జూన్‌లో ముగ్గురు వ్యక్తుల నుంచి 27వేలు డ్రాచేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చాక కూడా ఈ తరహా నేరాలు కొనసాగిస్తున్న క్రమంలో సత్యనారాయణఫురం పోలీస్టేషన్ పరిధిలో ఐదు నేరాలకు పాల్పడ్డాడు. ఆయా కేసుల్లో క్రైం బృందాలు సైబర్ విభాగం సహకారంతో నిందితుడిని అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.