క్రైమ్/లీగల్

చింతమనేనికి మరో 14 రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 9: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రిమాండును న్యాయస్థానం బుధవారం మరో 14 రోజులు పొడిగించింది. వివిధ కేసుల కింద పోలీసులు అరెస్ టుచేయడంతో గత నెల 11 నుంచి చింతమనేని రిమాండులో ఉన్నారు. ఇందులో ఐదు కేసులకు సంబంధించిన రిమాండు బుధవారంతో ముగిసింది. మరో కేసుకు సంబంధించిన రిమాండు గురువారంతో ముగియనుంది. ఏలూరులోని జిల్లా జైలులో ఉన్న చింతమనేనిని 2018లో విజిలెన్స్ అధికారుల విధులను అడ్డుకున్న కేసుకు సంబంధించి బుధవారం పోలీసులు పీటీ వారెంటుపై అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో చింతమనేనికి ఈ నెల 23 వరకూ కోర్టు రిమాండు విధించింది. చింతమనేనితోపాటు ఆయన అనుచరులు ఏలియా, సతీష్, రాజేష్, శ్రీనివాస్, దిలీప్, అప్పారావుకు కూడా కోర్టు 14 రోజుల రిమాండు విధించింది.