క్రైమ్/లీగల్

అస్థానా అవినీతి కేసులో మరో 2నెలల గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: సీబీఐ అధికారి రాకేష్ అస్థానా అవినీతి కేసులో విచారణకు ఢిల్లీ హైకోర్టు మరో రెండు నెలల గడువు మంజూరు చేసింది. అయితే, గడువు పొడిగింపు ఇదే ఆఖరిసారని.. మళ్లీ ఎలాంటి గడువు ఇచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు జస్టిస్ విభూ భక్రు తేల్చి చెప్పారు. సంస్థ అధికారి అస్థానా అవినీతి కేసు విచారణకు మరో ఆరు నెలల గడువు కావాలని సీబీఐ కోరింది. అమెరికా, అరబ్ ఎమిరేట్స్‌కు ఈ కేసుకు సంబంధించి రొగేటరీ లేఖలు పంపామని.. అక్కడి నుం చి సమాధానం రావాల్సి ఉందని.. అది వస్తే తప్ప విచారణ పూర్తి కాదంటూ సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ విక్రంజిత్ బెనర్జీ కోర్టుకు వివరించారు. న్యాయపరమైన సలహా కోసం రోగేటరీ సంప్రదింపులు జరపడం సాధారణం. ఇందులో భాగంగానే మరో మూడు నెలల సమయం కావాలని బెనర్జీ కోర్టుకు తెలియజేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను కోర్టు తిరస్కరిస్తూ కేవలం రెండు నెలల్లో విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. అవినీతి నియంత్రణ చట్టం కింద అప్పటి సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానాతో పాటు డీఎస్పీ దేవేందర్ కుమార్, వ్యాపారవేత్త మనోజ్ ప్రసాద్‌లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.