క్రైమ్/లీగల్

తప్పిన పెను ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 10: ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఏ మాత్రం అనుభవం లేనివారు ఆర్టీసీ బస్సులను నడుపుతుండటంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాదారులకు ప్రాణాలకు భద్రతా లేకుండా పోయింది. వచ్చిరాని డ్రైవింగ్‌తో ఆర్టీసీ బస్సులను నడుపుతుండటంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని వాహనాదారులు భయాందోళనలకు గురవుతున్నారు. గురువారం మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పిన సంఘటన ఇందుకు ఉదాహరణ. గురువారం మధ్యాహ్నం మేడ్చల్ పారిశ్రామిక బస్టాప్ సమీపంలో హైవేపై యూటర్న్ వద్ద ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ మొబైల్ వాహనం యూ టర్న్ తీసుకునేందుకు స్లో కాగా కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ మొబైల్ వాహనం అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో బెలూనులో తెరుచుకోవడంతో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. లేకుంటే పెను ప్రమాదమే జరిగేది. ఆర్టీసీ డ్రైవర్ అతివేగం కారణంగా ప్రమాదం జరిగినట్లు పెట్రోలింగ్ పోలీసులు తెలిపారు.