క్రైమ్/లీగల్

పాపాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, అక్టోబర్ 10: ప్రగతినగర్‌లో నకిలీ పాల విక్రయం జోరుగా సాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. బాచుపల్లి మండల పరిధిలోని ప్రగతినగర్ గ్రామంలో నివాసముండే పవన్, సౌమ్య దంపతులు. వీరి ఇంటికి వచ్చి పాలను విక్రయించే వ్యక్తి దసరా పండుగకు ఊరికి వెళ్లాడు. పవన్ ప్రగతినగర్ చౌరస్తాలోని సాయితేజా మిల్క్ సెంటర్‌లో పాల ప్యాకెట్లను కొనుగోలు చేసుకుని ఇంటికి వెళ్లి వేడిచేయగా పూర్తిగా ప్లాస్టిక్ ముద్దలా మారిపోయాయి. ఇదేమిటని పవన్ దుకాణ నిర్వాహకుడిని ప్రశ్నిస్తే తన వద్ద పాలను కొనుగోలు చేసినట్లు రుజువు ఉందా ఎవరికైనా ఫిర్యాదు చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడని బాధితులు ఆరోపించారు. బాచుపల్లి పోలీసులకు సాయితేజ మిల్క్ సెంటర్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.