క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన తెలంగాణ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: రక్తనిధికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ఆవినీతికి పాల్పడిన ఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మి రక్తనిధి సీఈవో నుంచి లంచం డిమాండ్ చేసింది. రక్తనిధికి అనుకూలంగా నివేదికను ఇచ్చేందుకు ఆమె రూ.1.20 లక్షల విలువ చేసే బంగారు గొలుసు ఇవ్వాలని కోరింది. బంగారు గొలుసు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. ఇదే వ్యవహారంలో గతంలో కూడా ఆమె రూ.50 వేల లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.