క్రైమ్/లీగల్

భార్యను కత్తితో నరికి... భర్త ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, అక్టోబర్ 13: కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణికావేశంలో భార్యపై కత్తితో దాడి చేసి, అనంతరం పురుగులమందు సేవించి ఆత్మహత్యచేసుకున్న భర్త ఉదంతమిది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య ఆసుపత్రిలో కోలుకుంటుండగా, భర్త ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... కొమరిగిరిపట్నానికి చెందిన పొలమూరి చంద్రశేఖర్ (55), విజయమోహిని (52) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరి పెద్ద కుమార్తె కాన్పు నిమిత్తం విజయమోహని నెల రోజుల క్రితం తుని వెళ్లింది. అయితే వారం క్రితం తుని వెళ్లిన చంద్రశేఖర్ వెంటనే ఇంటికి తిరిగిరావాలంటూ భార్య విజయమోహినితో గొడవపడ్డాడు. దీనితో మూడు రోజుల క్రితం విజయమోహిని కొమరగిరిపట్నం వచ్చేసింది. అప్పటి నుండి భార్యాభర్తల నడుమ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం చంద్రశేఖర్ కత్తితో భార్య విజయమోహినిపై దాడిచేసి, విచక్షణారహితంగా నరికాడు. రక్తపుమడుగులో కుప్పకూలిపోయిన భార్యను చూసి, చనిపోయిందని భావించిన చంద్రశేఖర్ ఇంట్లోకి వెళ్లి పురుగుల మందు సేవించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చంద్రశేఖర్‌ను అమలాపురం ఏరియాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడని అమలాపురం రూరల్ సీఐ ఆర్ భీమరాజు తెలిపారు. అలాగే రక్తపుమడుగులో పడివున్న విజయమోహినిని అమలాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్సపొందుతోందన్నారు. ప్రస్తుతానికి ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారన్నారు. బాధితురాలు విజయమోహిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లవరం ఎస్సై కె చిరంజీవి కేసు నమోదు చేసి, దర్యాప్తుచేస్తున్నారని సీఐ భీమరాజు వివరించారు.
*చిత్రం...కోలుకుంటున్న భార్య