క్రైమ్/లీగల్

ఆంధ్రా బ్యాంకులో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు జిల్లా యాదమరి అమరరాజ పరిశ్రమ వద్ద ఉన్న ఆంధ్రా బ్యాంకులో చోరీ వ్యవహారం సోమవారం వెలుగు చూసింది. బ్యాంకుకు వేసిన తాళాలు వేసి నట్లుగానే ఉండగా బ్యాంకు లాకర్లల్లో ఉన్న బంగారు నగలు, నగదు అపహరణకు గురికావడంతో బ్యాంకు సిబ్బందిపైనే పోలీసుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. యాదమరి మండలంలో గతంలో అమరాజా ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంతో ఫ్యాక్టరీ కార్మికులు స్థానికుల కోసం కొత్తగా ఆంధ్రాబ్యాంకు శాఖను ఏర్పాటు చేశారు. శుక్రవారం విధులకు హాజరైన బ్యాంకు మేనేజరుతో పాటు ఇతర సిబ్బంది సాయంత్రం యధావిధిగా బ్యాంకులోని లాకర్లకు ,ప్రధాన కార్యాలయానికి తాళాలు వేసుకొని వెళారు. శని, ఆదివారాలు వరుసగా రెండు రోజులు సెలవు కావడంతో సోమవారం ఉదయం మేనేజరు పురుషోత్తంతో పాటు బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయానికి వేసిన తాళాలు తెరచి బ్యాంకు కార్యక్రమాలను ప్రారంభించారు. ఇంతలోనే బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమేరాల సర్వర్‌కు సంబంధించిన వైర్లు కట్ చేసి ఉండటంతో అనుమానంతో బ్యాంకు లాకర్లను మేనేజరు ఇతర సిబ్బంది తెరిచి పరిశీలించారు. దీంతో అందులో ఉండాల్సిన బంగారు ఆభరణాలు, నగదు లేక పోవడంతో బ్యాంకు మేనేజరు యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు వద్దకు చేరుకున్న పోలీసు అధికారులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. శని , ఆదివారాలు బ్యాంకు
సెలవు కావడంతో మేనేజరు శనివారం బ్యాంకు వచ్చి కొంత సేపు ఉండి తిరిగి వెళ్లినట్లు బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు తెలిపారు. అయితే బ్యాంకు కార్యాలయానికి ఎక్కడా కన్నం వేయకుండా , వేసిన తాళాలు వేసినట్లుగానే ఉండటం, లాకర్ల ఏ మాత్రం ధ్వంసం కాకుండా ఉండటం, బ్యాంకుకు సెలవు రోజు అయిన శనివారం మేనేజరు మాత్రమే వచ్చి వెళ్లడం, లాకర్లకు సంబంధించి తాళాలు సైతం మేనేజరు వద్దనే ఉన్నందున బ్యాంకు సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంకులో పలువురు తనఖా పెట్టిన 3.40 కోట్ల విలువ చేసే 17 కేజిల బంగారు నగలు , 2.66లక్షల నగదు చోరీ అయినట్లు ప్రాథమిక సమాచారం . దీంతో చిత్తూరు డీ ఎస్పీ ఈశ్వర్ రెడ్డి ఇతర పోలీసు సిబ్బంది బ్యాంకును క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మేనేజరు పురుషోత్తంతో పాటు పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.