క్రైమ్/లీగల్

ఏపీ ఖాళీ చేసిన భవనాలు చాలవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేతపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రస్తుత సచివాలయంలో ఏపీ ఖాళీ చేసిన భవనాలు ఉన్నాయి కదా? అవి చాలడం లేదా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించింది. భవనాల కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు వాదనలు వినిపించారు. అగ్నిమాపక శాఖ సైతం ప్రమాదం పొంచి ఉందని పేర్కొందని ఆ శాఖ ఇచ్చిన నివేదికను కోర్టు ముందుంచగా, అగ్నిమాపక శాఖ ప్రమాద నియంత్రణకు చర్యలు చేపట్టాలని మాత్రమే సూచించిందని, భవనాలు కూల్చివేయమని పేర్కొనలేదు కదా? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అన్ని శాఖలనూ ఒకేచోట ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ యోచన అని ఏఏజీ న్యాయస్థానానికి చెప్పారు. పిటిషనర్ పీఎల్ విశే్వశ్వరరావు తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తమ వాదనలు వినిపించారు. నూతన సచివాలయ నిర్మాణంపై కేబినెట్ నిర్ణయం తీసుకుందని, సచివాలయ నిర్మాణం, భవనాల కూల్చివేతపై ఇప్పటికే కమిటీ వేశామని ప్రభుత్వం తరఫున ఏఏజీ వివరించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు సరిగా లేవని, సరైన పార్కింగ్ సదుపాయం కూడా లేదని చెప్పారు. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికను కోర్టు ముందుంచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన సచివాలయ భవనాలను ఎందుకు కూల్చివేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. సచివాలయంలో సుమారు ఏడేళ్ల క్రితం నిర్మించిన భవనాలను కూడా కూల్చివేస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. నూతన సచివాలయ నిర్మాణం వల్ల వందల కోట్ల ప్రజాధనం
దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. కోర్టు ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
రవిప్రకాశ్ కస్టడీపై ముగిసిన వాదనలు
టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కస్టడీకి సంబంధించి నాంపల్లి కోర్టులో వాదనలు సోమవారం నాడు ముగిశాయి. టీవీ-9 యాజమాన్యానికి తెలియజేయకుండానే డబ్బు డ్రా చేసుకున్నారంటూ నమోదైన కేసులో రవిప్రకాశ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే అనేక కీలక ఆధారాలు లభిస్తాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. పది రోజుల పాటు రవిప్రకాశ్‌ను పోలీసుల కస్టడీకి అప్పగించాలని ఆయన కోరారు. దీనిపై మంగళవారం నాడు తీర్పు వెలువడే అవకాశం ఉంది.