క్రైమ్/లీగల్

ఈడీ అభ్యర్థనపై తీర్పు రిజర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను తదుపరి విచారణ నిమిత్తం అరెస్టు చేసేందుకు అనుమతించాలన్న ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టు తమ నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. ఈ విషయంలో తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తానని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహర్ సోమవారం చెప్పారు. ఈ కుంభకోణంలో మరింత లోతుగా విచారణ జరపడానికి వీలుగా చిదంబరంను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత సోమవారం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుహర్ ముందు వాదన వినిపించారు. మనీ ల్యాండరింగ్ నేరం ప్రత్యేకమైందని, దీనిపై విచారణకు వీలుగా కస్టడీకి అప్పగించాలని మెహత తెలిపారు. ఇలాఉండగా చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ వినిపించిన వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఆరోపణల కేసుపై ఇదివరకే సీబీఐ రిమండ్‌లోకి తీసుకుని విచారణ నిర్వహించింది కాబట్టి ఇప్పుడు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ తమకు అప్పగించాలంటూ చేస్తున్న వాదనలో పస లేదని, ఆ అవసరమూ లేదని సిబల్ అన్నారు. చిదంబరం ఈ నెల 17వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. 74 ఏళ్ళ చిదంబరంను విచారణ కోసం తమకు అప్పగించాలని శుక్రవారం ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం విచారణ జరిగింది.