క్రైమ్/లీగల్

ఆధార్ అనుసంధానం పిటిషన్‌ను తిరస్కరించిన ‘సుప్రీం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆందోళనకరంగా మారిన నకిలీ, పెయిడ్ న్యూస్‌ల పరిశీలనకు సంబంధించి సామాజిక మాధ్యమాల ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానం తప్పనిసరి చేయాలని కేంద్రాన్ని ఆదేశించాల్సిందిగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. అయితే, దీనికి సంబంధించి స్వేచ్ఛగా హైకోర్టును ఆశ్రయించవచ్చని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో ఇలాంటి కేసే పెండింగ్‌లో ఉందని జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని బెంచ్ పిటిషనర్‌కు తెలియజేసింది. దీంతో ఈ కేసులో పిటిషనర్ అయిన అడ్వకేట్, బీజేపీ నాయకుడు అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకొన్నారు. ఆధార్ లింకేజికి సంబంధించి ఫేస్‌బుక్ దాఖలు చేసిన పిటిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉంది. మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టుకు కేసులు బదిలీ అయ్యాయి. ఫేస్‌బుక్, ట్విటర్ సహా ఇతర సామాజిక మాధ్యమాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని, ప్రెస్ కౌన్సిల్‌ను సైతం ఆదేశించాలని పిటిషనర్ అశ్వనీ కుమార్ కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో కోరారు. నకిలీ, పెయిడ్ న్యూస్‌లపై నియంత్రణకు ఇప్పటికే ఆధార్‌తో లింక్ అయిన సామాజిక మాధ్యమాల ఖాతాలను తక్షణమే రద్దు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టుకు పిటిషనర్ తెలియజేశారు.