క్రైమ్/లీగల్

ఏటీఎంల వద్ద మోసం చేసే కేటుగాడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, అక్టోబర్ 14: ఎటిఎం కేంద్రాలలో నగదు తీసుకోవటం చేతగాని మహిళలను, వృద్ధులను టార్గెట్‌గా పెట్టుకుని, వారిని ఏమార్చి వారి ఖాతాలలోని డబ్బు తీసుకునే అంతర్‌జిల్లా కేటుగాడు చింతల సురేష్‌బాబును అరెస్టు చేసి, అతని వద్ద నుండి 5.46 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ నగర డీసీపీ హర్షవర్ధన్, ఎసిపి సురేంద్రనాధ్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ నిందితుడు సురేష్‌బాబు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అని చెప్పారు. 16 కేసులకు సంబంధించి 5.46 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 2003లో విజయవాడ కృష్ణలంకలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడ్డాడని తెలిపారు. కష్టపడకుండా అడ్డదారిలో సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో ఎటిఎం కేంద్రాలకు వచ్చే వృద్ధులు, మహిళ ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నాడని చెప్పారు. 2017లో గుంటూరు జిల్లా తెనాలి, విజయవాడ, 2018లో విజయవాడ కృష్ణలంకలో కేసులు నమోదయ్యాయని, ఈ మూడు కేసుల్లో జైలుకు కూడా వెళ్ళాడని వీరు వివరించారు. జైలు నుండి బయటకు వచ్చిన తరువాత సురేష్ మళ్ళీ మోసాలకు శ్రీకారం చుట్టాడు. గన్నవరం, హనుమాన్‌జంక్షన్, గుడివాడ, నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతాలలో సుమారు 16 నేరాలకు పాల్పడ్డాడు. తాజాగా గన్నవరం ఎస్‌బిఐ ఎటిఎం వద్ద బాపులపాడు మండలం ఉమామహేశ్వర పురానికి చెందిన భవన నిర్మాణ కార్మికుల మేస్ర్తి కోరుతల్లి అనే మహిళ సురేష్‌బాబు సహాయం కోరింది. ఎటిఎం పిన్‌కోడ్ నెంబరు కూడా చెప్పింది. డబ్బులు రావటం లేదని చెప్పి, తన వద్ద ఉన్న పాత కార్డును మహిళకు ఇచ్చారు. ఇదే అదనుగా భావించిన సురేష్ 1.70 లక్షల రూపాయలు తీసుకున్నారు. నాలుగు రోజుల తరువాత ఆమె హనుమాన్‌జంక్షన్ బ్యాంకులో ఖాతా వివరాలు తెలుసుకోగా, జరిగిన మోసాన్ని తెలుసుకుంది. వెంటనే గన్నవరం పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేసింది. సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఎటిఎంల వద్ద నిఘా పెట్టారు. గన్నవరం విద్యానగర్ ఎస్‌బిఐ ఎటిఎం వద్ద ఇదే తరహాలో మోసం చేస్తుండగా సురేష్‌ను పోలీసులు పట్టుకున్నారు. విచారించి కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు వీరు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించటం ద్వారా మోసగాడి ఆట కట్టించామని చెప్పారు. ఎటిఎం కేంద్రాలకు వెళ్ళే ప్రజలు అపరిచిత వ్యక్తులను ఆశ్రయించవద్దని వీరు సూచించారు. అతి తక్కువ సమయంలో మోసగాడి ఆట కట్టించిన గన్నవరం పోలీసులను సీపీ ద్వారక తిరుమలరావు, డీసీపీ హర్షవర్థన్ అభినందించారు.