క్రైమ్/లీగల్

తండాలో పేలిన సిలిండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, అక్టోబర్ 15: మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాలోని ఓ ఇంట్లో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలిన ఘటనలో ఓ బాలికకు స్వల్ప గాయాలు కాగా తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం.. రాజబొల్లారం తండాలో కూరిస్వామి అక్రమంగా చిన్న సిలిండర్‌లలో గ్యాస్ రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తుంటాడు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో వంటగ్యాస్ సిలిండర్ నుంచి చిన్న సిలిండర్‌లలోకి రీఫిల్లింగ్ చేస్తుండగా గ్యాస్ లీకై సమీపంలోనే స్వామి భార్య వంట చేస్తుండటంతో ఒక్కసారిగా ఉవ్వెత్తున్న మంటలు లేచాయి. దీంతో భయబ్రాంతులకు గురైన స్వామి అతని భార్య మనుమరాలు రుతికలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేయడంతో పాటు ఫైర్ స్టేషన్‌కు కూడా సమాచారం అందించారు. అప్పటికే మంటలు ఇళ్లంతా వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో పాటు చిన్న సిలిండర్‌లు పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆరు చిన్న సిలిండర్ పేలిపోయాయి. పక్క గదిలో పెద్ద సిలిండర్ కూడా ఉండటం మంటలు ఆ గదికి వ్యాపించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ నేపథ్యంలో స్వామి మనుమరాలు రుతికకు స్వల్ప గాయాలలుకాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.