క్రైమ్/లీగల్

ఈడీ కస్టడీకి చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఉద్దేశపూర్వంగానే తనపై కేసులు బనాయించిందని, తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన చిదంబరం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరోపక్క మనీలాండరింగ్ కేసులో చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభ్యర్థనకు ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో మాజీ ఆర్థిక మంత్రిని ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉంది. కాగ సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ మాజీ మంత్రి తరఫున సుప్రీంలో వాదనలు వినిపించారు. చిదంబరం, ఆయన కుటుంబ సభ్యులు సాక్షులను ప్రలోబపెడుతున్నారన్న ఆరోపణలు లేవని న్యాయమూర్తి ఆర్ బానుమతి నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేసుతో కాంగ్రెస్ సీనియర్ నేతకు ఎలాంటి సంబంధం లేదని సిబల్, సింఘ్వీ స్పష్టం చేశారు. కాగా బెయిల్ కోసం గత నెల 30 హైకోర్టును ఆశ్రయించిన చిదంబరానికి చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. సీబీఐ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తారు. సాక్ష్యాధారాలను తారుమూరు చేసే అవకాశం ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని సోమవారం సుప్రీం కోర్టులో సీబీఐ వాదించింది. సాక్షులను ప్రభావితం చేయడం సహా పలు కారణాలు రీత్యా 74 ఏళ్ల చిదంబరానికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరుతోంది. ఇంతకు ముందే బెయిల్ కోసం చిదంబరం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో సీబీఐకు నోటీసులు జారీ అయ్యాయి. ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి గత నెల 17 నుంచి తీహార్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనను ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో 2017 మే 15న ఆయనపై కేసు నమోదైంది.

*చిత్రం... కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం