క్రైమ్/లీగల్

బాబర్‌ది చారిత్రక తప్పిదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో మసీదు నిర్మిస్తూ బాబర్ చక్రవర్తి పాల్పడ్డ చారిత్రక తప్పిదాలను సరిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందని ఓ హిందూ సంస్థ మంగళవారం సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది.
ఈ హిందూ పార్టీ తరఫున వాదించిన అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది కే పరాశరణ్ మాట్లాడుతూ ‘అయోధ్యలో అనేక మసీదులు ఉన్నాయి. అక్కడ ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ హిందువులు శ్రీరాముడి జన్మస్థలాన్ని మార్చుకోలేరు’ అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్‌కి స్పష్టం చేశారు. బాబర్ చక్రవర్తి భారత్‌ను ఆధీనం చేసుకుని చట్టానికి అతీతంగా వ్యవహరించాడని, శ్రీరాముడి జన్మస్థలంలో మసీదును నిర్మించడం ద్వారా చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాడని పరాశరణ్ తెలిపారు.
ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం అనేక ప్రశ్నలను సంధించింది. ఒకసారి మసీదు నిర్మితమైతే అది ఎప్పటికీ మసీదే అవుతుంది అన్న వాదనతో మీరు ఏకీభవిస్తారా? అని పరాశరణ్‌ను ప్రశ్నించింది. అయితే, దానికి లేదు అని ఆయన సమాధానం చెప్పారు. ‘ఒకసారి ఆలయం నిర్మితమైతే అది ఎప్పటికీ ఆలయమే అవుతుంది’ అని పరాశరణ్ స్పష్టం చేశారు.
కేవలం ముస్లింలు మాత్రమే అయోధ్య అంశంపై ప్రశ్నిస్తున్నారని ముస్లిం పార్టీల తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ సోమవారం కోర్టులో పేర్కొన్న నేపథ్యంలో మంగళవారం హిందూ సంస్థల న్యాయవాదిని అనేక కోణాల్లో ధర్మాసనం ప్రశ్నించింది.