క్రైమ్/లీగల్

కూల్‌డ్రింక్‌లో విష ప్రయోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, అక్టోబర్ 15: ఇద్దరు రైతుల మధ్య ఏర్పడిన పాతకక్షలు ఒక బాలుడిని బలిగొన్నాయ. తన ఎదురుగా ఉన్న పొలానికి చెందిన వ్యక్తిపై కక్ష తీర్చుకునేందుకు మరో రైతు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి పెట్టడం, అది తాగి చిన్నారి మృతి చెందడంతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి తండాలో మంగళవారం విషాదం నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. సోమవారం ఉదయం పెర్కపల్లి గ్రామానికి చెందిన బానోత్ తిరుపతి తన భార్య బానోత్ రజితతో పాటు తన పిల్లలైన బానోత్ ఐశ్వర్య (7), శివరాంనాయక్ (4)లను తీసుకొని తన పొలంలోని గడ్డిని తీసేందుకు వెళ్లారు. అక్కడ భార్య భర్తలు పొలంలో ఉన్న గడ్డిని తీస్తున్నారు. ఆ పాలంలో కనిపించిన విషం కలిపి ఉన్న మాజా కూల్‌డ్రింక్ బాటిల్‌ను తీసుకువచ్చి ఇంట్లో ఉంచి బాటిల్‌ను తన ఇద్దరు పిల్లలకు తాగించారు. ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే బానోత్ తిరుపతి బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో శివరాంనాయక్ మృతి చెందాడు. ఐశ్వర్య కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మృతిచెందిన బాలుడు శివరాంను కరీంనగర్ నుండి సోమవారం అర్థరాత్రి పోస్టుమార్టం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇలావుండగా, బానోతు తిరుపతి పొలం ఎదురుగా లావుడ్య తులసీరాం పొలం ఉంది. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న తిరుపతి తన పొలం గట్టుపైన మూడు మద్యం సీసాలను ఉంచడమే కాకుండా పొలంలో విషం కలిపిన మాజా కూల్‌డ్రింక్ బాటిల్‌ను సైతం ఉంచడంతో కూల్‌డ్రింక్ అని భావించి ఇంటికి తెచ్చుకుని తాగడంతోనే ఈ విషాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ సంఘటనకు బాధ్యుడైన తులసీరాంను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని బాధితులు ఏసీపీ బాలుజాదవ్‌ను డిమాండ్ చేశారు. చిన్నారి బాలుడు మృతితో పెర్కపల్లి గ్రామంలో విషాదం నెలకొంది.
*మృతి చెందిన చిన్నారి శివరాం
*చికిత్స పొందుతున్న ఐశ్వర్య (ఫైల్ ఫొటోలు)