క్రైమ్/లీగల్

గ్రామస్థుల చేతిలో దొంగ హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, అక్టోబర్ 15: దొంగతనానికి పాల్పడుతూ గ్రామస్థుల చేతికి చిక్కి వారు కొట్టిన దెబ్బలకు తాళలేక ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ధర్మోర గ్రామంలో జరిగింది. మాక్లూర్ ఎస్‌ఐ సాయినాథ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని అర్సాపల్లికి చెందిన గంట గంగాధర్ (35) గత యేడాది మాక్లూర్ మండలం ధర్మోర గ్రామానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.
అప్పటి నుండి తరచూ ఈ గ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈనెల 14న రాత్రి ధర్మోర గ్రామానికి అతి సమీపంలోని మహాలక్ష్మీ ఆలయంలో కొందరు వ్యక్తులు దొంగతనానికి యత్నించే నేపథ్యంలో ఆలయం తాళం బద్ధలు కొట్టారు. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు మేల్కొని మహాలక్ష్మీ ఆలయంలో దొంగలు చొరబడ్డారంటూ కేకలు వేస్తూ కర్రలు పట్టుకొని వెళ్లారు. స్థానికుల రాకను గమనించిన దొంగలు పారిపోతుండగా గ్రామస్తులు వెంబడించారు. వారిలో ఒకరు గ్రామస్తుల చేతికి చిక్కగా, మిగతా వారు పారిపోయారు. ఆలయంలో చోరీకి యత్నించడం పట్ల గ్రామస్థులు ఆగ్రహించి కర్రలతో దొంగను చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయిన వ్యక్తిని గంగాధర్‌గా గుర్తించి, 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గంగాధర్ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 8 గంటలకు మృతి చెందినట్టు ఎస్‌ఐ సాయినాథ్ తెలిపారు. మృతి చెందిన గంట గంగాధర్‌పై ఇప్పటికే 1వ టౌన్, 6వ టౌన్‌లలో పలు దొంగతనాల కేసులు ఉన్నాయని, నగర సమీపంలోని అర్సాపల్లి నివాసిగా గుర్తించామన్నారు. ఈ మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ తెలిపారు.
*చిత్రం... గ్రామస్థుల చేతిలో హతమైన గంగాధర్