క్రైమ్/లీగల్

ట్రాలీ ఆటో బోల్తా..32 మంది కూలీలకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, అక్టోబర్ 15: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలో ట్రాలీ ఆటో బోల్తాపడిన ప్రమాదంలో 32 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది. నేరెడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామ సమీపం లోని ప్రధాన రహదారిపై మంగళవారం పత్తి కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో టైర్ పేలిపోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో 32 మంది గాయపడ్డారు. కాగా వీరిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని హైద్రాబాద్‌కు తరలించారు. గువ్వలగుట్ట గ్రామానికి చెందిన 42 మంది కూలీలు ఇదే మండలంలోని కొత్తపల్లి గ్రామం వద్ద పత్తిని తీసేందుకు టీ ఎస్ 05 యుడి 0322 నెంబర్ గల ట్రాలీ ఆటోలో స్వగ్రామం నుండి మంగళవారం ఉదయం బయలుదేరారు. 42 మంది కూలీలతో ఆటో వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఆటో వెనుక టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన ఆటో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా పడిపోయారు. గాయపడ్డ 28 మందికి చికిత్స అందించిన వైద్యులు వీరిలో 9 మంది పరిస్ధితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలించారు.