క్రైమ్/లీగల్

కల్కి ఆశ్రమంపై ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం, అక్టోబర్ 16: కల్క్భిగవాన్ ఆశ్రమం (ఏకం ఆధ్యాత్మిక కేంద్రం)పై బుధవారంనాడు తమిళనాడుకు సంబంధించిన నాలుగు బృందాలు ఐటీ దాడులు నిర్వహించారు. తెల్లవారుజామున సుమారు 6.30గంటల సమయంలో 20 వాహనాల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు, సిబ్బంది ఏడు బృందాలుగా విడిపోయి చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఏకం, జీసీ 2, గోవర్దన్‌పురం, క్యాంపస్ 1, క్యాంపస్ 2, క్యాంపస్ 3, క్యాంపస్ 4 ఆఫీస్‌లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ఇన్‌కంటాక్స్ అధికారులు తమిళనాడు పోలీస్ టీంతో వరదయ్యపాళెంలోని అన్ని క్యాంపస్‌లను తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. ఇదే తరహాలో నేమం కల్కి ఆశ్రమంతో పాటు కల్కి అనుబంధ సంస్థలు అయిన మరో 30చోట్ల ఐటీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. లోపల ఉన్న వ్యక్తుల నుండి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎటువంటి సమాచారం బయటకు వెళ్లకుండా పకడ్బందీగా సోదాలు నిర్వహించారు. ఆయా ఆఫీసులలోని ఇన్‌చార్జిలను విచారిస్తూ పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ట్రస్ట్ సిఈవో లోకేష్ దాసాజీని విచారణ చేస్తున్నారు. ట్రస్ట్ ఆదాయ వనరులు, వాటి ఖర్చుల విషయంపై అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఏకం ఆధ్యాత్మిక కేంద్రం ఫౌండర్ కృష్ణదాసాజీకి సంబంధించి చెన్నైలో ఉన్న ఆయన ఇంటిపైన, నుంగంబాకంలోని వారి ప్రధాన కార్యాలయం, తిరువళ్లూరు వద్ద ఉన్న నేమంలో కూడా దాడులు నిర్వహించినట్లు
సమాచారం. కృష్ణదాసాజీ వ్యాపార లావాదేవీలకు సంబంధించి హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఉన్న కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాల్లోను ఏకకాలంలో ఐటీ దాడులు నిర్వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిరంతరం నిర్వహించే తనిఖీల్లు భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు ట్రస్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా కల్కి ఆశ్రమానికి దేశవిదేశాల నుండి వచ్చే భక్తులు విరాళాల రూపంలో ఇచ్చిన నిధులను నిర్వాహకులు భూముల కొనుగోళ్లు, డిపాజిట్ చేయడం వంటి వాటిపై మళ్లిస్తున్నారని ఫిర్యాదులు తమిళనాడు ఐటీ అదికారులకు అందడంతో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఏది ఏమైనా కల్కి ఆశ్రమంపై ఐటీ దాడులు ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.
ఇదిలావుండగా చిత్తూరు జిల్లా రామకుప్పం మండల శివారులోని కల్కి ఆశ్రమంలో బుధవారం వేకువ జామున తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పలు గదులను పరిశీలించడంతో పాటు,కంప్యూటర్లు, పలు రికార్డులు , గోల్డన్ ట్రాక్ , పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా నాలుగు బృందాల ఐటీ అధికారులు నాలుగు గంటల పాటు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పలు రికార్డులను స్వాధీనం చేసుకొన్నారు. కల్కి ఆశ్రమాలైన చెన్నై ,వరదయ్యపాళ్యం ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్న నేపధ్యంలో రామకుప్పంలోని ఆశ్రమంలో కూడా ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి చెందిన శ్రీరామ్ దాసాజీ మాట్లాడుతూ తమిళనాడు నుంచి వచ్చిన పలువురు ఐటీ అధికారులు ఈ ఆశ్రమంలో పలు గదులను పరిశీలించడంతో పాటు రికార్డులు తనిఖీచేశారని, అలాగే భక్తులను , ఇక్కడ పని చేసే కూలీలను పలు విధాలుగా ప్రశ్నించారని, తదుపరి తిరుగుపయనం అయ్యారని, ఐటీ దాడులకు సంబంధించి సమాచారం తెలియాల్సి ఉందన్నారు.