క్రైమ్/లీగల్

అమానవీయ ఘటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 16: నిమ్స్ ఆవరణలో బుధవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆడ శిశువు జన్మించడంతో పేగు బందాన్ని సైతం కాదని శిశువును కవర్‌లో పెట్టి ఆసుపత్రి ఆవరణలో వదిలి వెళ్లిపోయారు. చెత్తకుప్పలో శిశువు ఏడుపును గమనించిన ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సజీవంగా ఉన్న ఆడ శిశువును గుర్తించారు. హుటాహుటిన నిమ్స్ ఎమర్జెన్సీకి తరలించి పాపకు చికిత్సలు అందజేశారు. పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శిశువును అమీర్‌పేటలోని శిశు విహార్‌కు తరలించారు. సజీవంగా ఉన్న ఆడ శిశువును నిమ్స్ ఆవరణలో వదిలి వెళ్లారన్న సంగతి తెలుసుకున్న రోగులు వారి బందువులు, స్థానికులు కంటనీరు పెట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో సీసీ కెమెరా పుటేజీలను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు.