క్రైమ్/లీగల్

రవిప్రకాశ్ కస్టడీకి పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కస్టడీ కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు తాజాగా మరో పిటిషన్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. హైకోర్టులో కొనసాగుతున్న కేసులో రవిప్రకాశ్‌కు కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్‌లో వచ్చే నెల రెండో తేదీ వరకూ స్టే ఉందన్న సమాచారం నేపథ్యంలో, నాంపల్లి కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇంత వరకూ పోలీసులు మొత్తం సమాచారాన్ని సేకరించారని, పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి వాంగ్మూలం నమోదు చేశారని రవిప్రకాశ్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కొత్తగా పోలీసులు సేకరించేది ఏమీ లేదని పేర్కొంటూ వారు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ అనంతరం నాంపల్లి కోర్టు రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా నమోదైన మరో కేసులో విచారించేందుకు పీటీ వారెంట్‌పై సైబరాబాద్ పోలీసులు రవిప్రకాశ్‌ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. అయితే మియాపూర్ కోర్టు ఆయనకు జుడిషియల్ రిమాండ్ విధించింది.
మరో కేసు
రవిప్రకాష్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం మరో కేసు నమోదు చేశారు. ఐ ల్యాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద ఆయన నకిలీ ఐడీ సృష్టించి అవకతవకలకు పాల్పడారన్నది పోలీసులు ఆరోపణ. ఆ నేపథ్యంలో ఆయనపై 406/66 ఐటీ యాక్ట్ కింద మరోకేసు నమోదైంది. టీవీ-9లో రూ.18 కోట్ల నిధుల అవకతవకల కేసులో ప్రస్తుతం ఆయన విచారణ నిమిత్తం చంచల్‌గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, రవిప్రకాష్‌ను గురువారం పీటీ వారెంట్ కింద పోలీసులు మియాపూర్ న్యాయస్థానానికి తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదిలావుంటే రవిప్రకాష్‌పై బుధవారం కూడా ఓ కేసు నమోదయింది. ఆయనకు చెందిన వెబ్ ఛానెల్స్‌లో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది రామారావు ఫిర్యాదు చేశారు. దీనితో రవిప్రకాష్‌కు చెందిన మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.

*చిత్రం...టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్