క్రైమ్/లీగల్

కల్కి ఆశ్రమంలో కొనసాగిన ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళెం : చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండల పరిధిలోని కల్కి భగవాన్ ఆశ్రమంలో గురువారం కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగించారు. ఈక్రమంలో ‘ఎం-బ్లాక్’లోని ఓ గదిలో ఉన్న కప్‌బోర్డులో ఒక సంచి నిండా విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు ఉండటాన్ని గుర్తించారు. వీటి విలువ 20 నుంచి 25 కోట్లు ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఐటీ అధికారులు మాత్రం ఆశ్రమంలో స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, బంగారు ఆభరణాల గురించి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలావుండగా, తమిళనాడులోని కల్కి ఆశ్రమంలో 33 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మరో ప్రచారం సాగుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కల్కి భగవాన్ ఆశ్రమానికి ఎంతో భక్తి విశ్వాసాలతో దాతలు ఇచ్చిన వివరాలను ఆశ్రమ నిర్వాహకులు భూముల కొనుగోళ్లు, డిపాజిట్లకు మళ్లించినట్లు తమిళనాడు ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు అందిన విషయం పాఠకులకు విదితమే. ఈ క్రమంలో తమిళనాడు, ఆంధ్రా, తెలంగాణా ప్రాంతంలోని కల్కి భగవాన్‌కు సంబంధించిన ఆశ్రమాలు, అనుబంధ సంస్థలపైన ఆదాయ పన్ను శాఖ అధికారులు వందల సంఖ్యలో ఏకకాలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి దాడులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో వరదయ్యపాళెంలోని కల్కి ఆశ్రమంలో దాడులు పూర్తిచేసుకున్న అధికారులు అప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, ఆభరణాలకు సంబంధించి లెక్కలు కట్టారు. తిరిగి వారు వెళ్లే సమయంలో ఆశ్రమంలోని పూర్ణిమ అనే ఫ్యాకల్టీ ‘ఎం బ్లాక్’ సేఫ్ అనే మెసేజ్‌ను తన పై అధికారికి పంపినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు చివరి నిమిషంలో గుర్తించారు. బుధవారం దాడులు ప్రారంభించిన ఆదా య పన్ను శాఖ అధికారులు ఆశ్రమంలోని ప్రతి ఒక్కరి సెల్‌ఫోన్‌నుపై నిఘా ఉంచారు. ఈ క్రమం లో గురువారం సాయంత్రం ఈ మెసేజ్ పూర్ణిమ పంపించిందని ఆదాయ పన్ను నిఘా వ్యవస్థ ఆశ్రమంలో ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో అధికారులు మెసేజ్ పంపిన పూర్ణిమను గుర్తించి ప్రశ్నించారు. అయితే ఎం-బ్లాక్ తనకు తెలియదంటూ ఆమె ఆదాయ పన్ను శాఖ అధికారుల ముందు బొంకడంతో అధికారుల బృందంలోని ఓ మహిళా అధికారిని తనదైన శైలిలో పూర్ణిమను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో పూర్ణిమ సహకారంతో ఎం-బ్లాక్‌లోని గుర్తించి తెరిపించారు. అం దులో ఉన్న ఓ కప్‌బోర్డులో ఉంచిన ఓ సంచిలో విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలను గుర్తించి స్వా ధీనం చేసుకున్నారు. వాటిని కూడా లెక్కలు కడుతున్నారు. ఇదిలావుండగా, తాము ఎంతో స్నేహపూర్వకంగా తనిఖీలకు సహకరించామని ముందుగా కోరినా, తమను తప్పుదారి పట్టించడం ఎంతవరకు సమంజసమని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆశ్రమంలో ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏదేమైనా కల్కి ఆశ్రమంలో కోట్ల రూపాయలు లెక్కకు మించిన ఆస్తులు దొరుకుతుండటం చర్చనీయాంశంగా మారింది.