క్రైమ్/లీగల్

కలెక్టరేట్ ముందు ఒకరి ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, ఏప్రిల్ 16: తన భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరు రికార్డుల్లో మార్పిడి చేసి తనకు అన్యాయం చేశారని మనస్థాపం చెందిన మంథని మండలం సిరుపురం గ్రామానికి చెందిన సమ్మెట మల్లయ్య కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. మల్లయ్య కుటుంభసభ్యులతో కలిసి సోమవారం కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన అనంతరం అతని జేబులోంచి పురుగుల మందు డబ్బాను తీసి ఆత్మహత్యకు పాల్పడే యత్నం చేయగా అక్కడే ఉన్న పెద్దపల్లి ఎస్సై జగదీష్ గమనించి సిబ్బంది సహాయంతో అడ్డుకున్నారు. మల్లయ్యను వివరణ కోరగా రెవెన్యూ అధికారులు రికార్డుల్లో తన భూమిని మార్పిడి చేశారని ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అందుకే ఈనిర్ణయం తీసుకున్నట్లు అధికారులతో వాపోయాడు. అనంతరం ప్రజావాణిలో డీఆర్‌ఓ పద్మయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఒక్కసారిగా కలెక్టరేట్ ప్రాంగణంలో కలకలం సృష్టించింది.

అక్రమంగా తరలిస్తున్న సబ్సిడీ బియ్యం పట్టివేత
* ముగ్గురి అరెస్టు
సిరిసిల్ల, ఏప్రిల్ 16: సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వం పేద ప్రజలకు సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యాపారులను సోమవారం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుండి 50 క్వింటాళ్ళ సబ్సిడీ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను, అలాగే ఇదే వ్యాపారం చేస్తున్న మరో వ్యక్తిని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు సిరిసిల్ల పట్టణంలోని సుభాస్‌నగర్‌కు చెందిన రాచకొండ భాస్కర్(45), గాంధీనగర్‌కు చెందిన వంగరి వంశీ(32), సాయినగర్‌కు చెందిన మేర్గు శ్రీనివాస్(32)ల నుండి 50 క్వింటాళ్ళ సబ్సిడీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ సీఐ ఆర్.బన్సీలాల్ వెల్లడించారు. సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్‌లో వాహనాలు తనిఖీ చేయగా అక్కడికి వచ్చిన ఆటో ట్రాలీను కూడా సోదా చేయగా అందులో 25 కిలోల బరువు గల 40 సోనా రైస్ సంచుల్లో బియ్యం నింపి ఉన్నాయి. నెం.ఎపి15 వై 2092 వాహనంలో రాచకొండ భాస్కర్, మెరుగు శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అలాగే గాంధీనగర్‌లో మరో వ్యక్తి వంగరి వంశీ ఇంటిలో సోదా చేయగా ఇతడి వద్ద 40 కిలోల సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.