క్రైమ్/లీగల్

ఆర్మీ జవాను దారుణ హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, అక్టోబర్ 20: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో శనివారం అర్ధరాత్రి దాటాక ఓ ఆర్మీ జవాను దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేటలోని ఎస్సీ కాలనీకి చెందిన హన్మకొండ ప్రేమ్‌కుమార్ (27) శ్రీనగర్‌లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం సెలవుపై స్వస్థలమైన నర్సంపేటకు వచ్చాడు. శనివారం ఉదయం తన తల్లి విమలకు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాడు. శనివారం రాత్రి నర్సంపేటలో సెకండ్ షో సినిమాకు వెళ్లాడు. ఈ క్రమంలో సినిమా అర్ధ్భాగంలోనే తన స్నేహితుడు చిలువేరు రాకేష్ నుంచి ఫోన్ వచ్చింది. తన స్నేహితుడు బత్తుల రాకేష్ బర్త్‌డే ఉందని, ఈరాత్రే పట్టణంలోని వల్లబ్‌నగర్‌లో కేక్ కట్ చేయాలని పిలిచాడు. వెంటనే ప్రేమ్‌కుమార్ సినిమా పూర్తిగా చూడకుండానే వల్లబ్‌నగర్ జెండా గద్దె వద్దకు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న చిలువేరు రాకేష్, బత్తుల రాకేష్‌లతో పాటు మరో నలుగురి మద్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇదే సమయంలో ప్రేమ్‌కుమార్ ఆ గొడవలో తలదూర్చాడు. ఈ క్రమంలో దూదిమెట్ట దిలీప్ అనే యువకుడు మద్యం మత్తుతో పాటు క్షణికావేశంతో కేక్ కట్ చేసే కత్తితో ప్రేమ్‌కుమార్‌ను గుండెలో పొడిచాడు. గుండె దమన్ల వద్ద పొడవటంతో ప్రేమ్‌కుమార్‌కు తీవ్ర రక్తస్రావం అయ్యంది. వెంటనే నర్సంపేటలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఎంజీఎంకు తరలించగా అక్కడి వైద్యులు హైద్రాబాద్‌కు రెఫర్ చేశారు. హైద్రాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఆదివారం తెల్లవారుజామున ప్రేమ్‌కుమార్ మృతిచెందాడు. ప్రేమ్‌కుమార్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం నర్సంపేట మార్చురీకి తీసుకొచ్చారు. మృతుడికి భార్య నీల, ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నారు. మృతుడి తల్లితండ్రులు హన్మకొండ రమేష్, విమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రేమ్‌కుమార్‌ను కత్తితో పోడిచిన ప్రధాన నిందితుడు దూదిమెట్ల దిలీప్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. కాగా ఘటనలో మరో నలుగురు పరారీలో ఉన్నట్టు సమాచారం.