క్రైమ్/లీగల్

బాలిక పట్ల అసభ్యకర ప్రవర్తన.. ముద్దాయికి ఐదేళ్ల జైలు, జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 21: బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలుశిక్ష, 500 రూపాయలు జరిమానా విధిస్తూ స్పెషల్ కోర్టు ఫర్ పోక్సో యాక్ట్ కేసుల కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పాయకాపురం కండ్రిక కాలనీకి చెందిన కొత్తపల్లి అబ్రహాం(38) అనే వ్యక్తి స్థానికంగా నివాసముంటున్న ఆరేళ్ల బాలిక పట్ల 2016 జనవరి 24న అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున పోలీసులు ప్రవేశపెట్టిన 8 మంది సాక్షులను విచారించారు. నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.