క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సిద్దపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో సోమవారం తెల్లవారుజామున ఈ రోడ్ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనకు సంబందించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లికి చెందిన కన్నుకుంట్ల మల్లేశం (49), జంగ ప్రభాకర్ రెడి డ(48), అలివేలి జనార్దన్‌రెడ్డి (45), పుల్లయ్య, దేవేందర్‌రెడ్డి, శంకర్ హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమానికి కారులో ఆదివారం సాయంత్రం వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రజ్ఞాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని అతివేగంగా వస్తూ అదుపు తప్పి ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న మల్లేశం, ప్రభాకర్‌రెడ్డి, జనార్దన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, పుల్లయ్య, గోవర్దన్, దేవేందర్, శంకర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. కాగా మృతి చెందిన మల్లేశం, ప్రభాకర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఆసుపత్రి వద్ద తీవ్ర విషాదం నెలకొనగా, మృతుల రోదనలతో అక్కడికి చేరిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
రోడ్డు ప్రమాద స్థలాన్ని సోమవారం ఉదయం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. అనంతరం గజ్వేల్ ఆసుపత్రికి చేరుకొని మృతదేహాలను ఆయన పరిశీలించడంతో పాటు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టారు. మంచి ఆప్తులను, అభిమానులను కోల్పోవడం ఎంతో బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మృతుల కుటుంబాలకు తన వంతు సహకారం అందిస్తామని, ప్రభుత్వం దృష్టికి తెచ్చి అన్ని రకాలుగా ఆదుకుంటానని ఆయన హామీనిచ్చారు.

*చిత్రం...గజ్వేల్ ఆసుపత్రిలో బాధిత కుటుంబీకులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే బాలకిషన్