క్రైమ్/లీగల్

ఇద్దరు డైట్ విద్యార్థినులను బలిగొన్న పాఠశాల బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,అక్టోబర్ 21: ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీలో సోమవారం సాయంత్రం ప్రైవేట్ స్కూల్ బస్సు ఇద్దరు డైట్ విద్యార్థినుల ప్రాణాలు బలిగొంది. రవీంద్రనగర్ కాలనీలో గల విద్యార్థి ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన బస్సు బస్టాండ్ వైపు నుంచి కళాశాలకు వెళ్తుండగా రవీంద్రనగర్ కాలనీలోని రాంరెడ్డి హైస్కూల్ పక్కనే గల మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న యాక్టివా స్కూటీని ఢీకొన్న సంఘటనలో డైట్ కళాశాల ఛాత్రోపాధ్యాయులు సాజియా (22), సాఫియా (19) అనే ఇద్దరు అక్క చెల్లెళ్లు మృతి చెందారు. డైట్ కళాశాల నుండి స్కూటీపై ముగ్గురు బొక్కలగూడలోని తమ నివాస గృహానికి వెళ్తుండగా బస్సు స్కూటీని ఢీకొట్టింది. ఒక్కసారిగా అదుపుతప్పి స్కూటీ బస్సు ముందు చక్రాల కింద పడిపోవడంతో సాజియా టైర్లకింద నలిగి దుర్మరణం చెందగా సోదరి సాఫియా తలకు తీవ్ర గాయాలతో రక్తసిక్తం కావడంతో వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరగంటలోనే ఆమె ప్రాణాలు వదిలింది. కాగా స్కూటీ బైక్ నడుపుతున్న సోదరుడు వాజిద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.
కాగా పేద కుటుంబానికి చెందిన ఇద్దరు డైట్ విద్యార్థినులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన కళాశాల విద్యార్థుల్లో విషాదాన్ని నింపగా డీఈవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న ఇద్దరు కూతుళ్ళ తండ్రికి అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. సాయంత్రం రిమ్స్‌లో పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
*చిత్రం... బస్సు చక్రాల కింద పడి ఉన్న మృతదేహం
*ఇన్‌సెట్‌లో మృతులు సాజియా, సాఫియా (ఫైల్‌ఫొటోలు)