ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ నేత తిక్కారెడ్డి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు, అక్టోబర్ 21: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు ఎమ్మిగనూరులో ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్‌లోని ఒక మద్యం పరిశ్రమకు వరి పొట్టు కొనుగోలుకు సంబంధించి రూ.12 కోట్లు బకాయి ఉండడంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఆదివారం అర్ధరాత్రి ఎమ్మిగనూరు పట్టణంలోని ఇంట్లో ఉన్న తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి వెంట తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలోని కేసులో ముద్దాయిగా ఉన్న తిక్కారెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చిన సైబరాబాద్ పోలీసులు తొలుత జిల్లా ఎస్పీ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో ఇంట్లో ఉన్న తిక్కారెడ్డిని అరెస్టు చేసి వెంట తీసుకువెళ్లినట్లు సమాచారం. శంషాబాద్‌లో ఉన్న మద్యం పరిశ్రమకు సంబంధించి వరి పొట్టు కొనుగోలుకు చెల్లించాల్సిన రూ. 12 కోట్లు బకాయి ఉండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
బాధితులు పెట్టిన కేసులో తిక్కారెడ్డి మూడవ ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం. తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన వార్త సోమవారం ఉదయం నియోజకవర్గంలో దావనలంగా వ్యాపించింది. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలవరపడ్డారు. ఈ విషయంపై ఎమ్మిగనూరు పట్టణ సీఐ శ్రీ్ధర్‌ను వివరణ కోరగా సైబరాబాద్ పోలీసులు తిక్కారెడ్డిని అరెస్టుచేసి తీసుకెళ్లారని, అయితే ఎందుకు తీసుకెళ్లారో తమకు తెలియదన్నారు.

*చిత్రం... టీడీపీ నేత తిక్కారెడ్డి