క్రైమ్/లీగల్

ప్రభుత్వ పాఠశాలలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 23: పోలీసుస్టేషన్‌ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దొంగలు చొరబడి విలువైన వస్తువులు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలీసుస్టేషన్‌కు ఆనుకొని ఉంది. ఆర్టీసీ సమ్మెతో అక్టోబర్ 20 వరకు పాఠశాలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. పాఠశాలకు చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు. పాఠశాల ప్రధాన గేట్ పోలీసుస్టేషన్‌లను ఆనుకొని ఉంది. పాఠశాల ఆవరణలో మహిళా భవన్ ఏర్పాటు చేయడంతో ప్రహారీగోడను కొద్ది భాగం కూల్చి వేసి దారి ఏర్పాటు చేశారు. అక్కడ గేట్ పెట్టకపోవడంతో ఇదే అదునుగా భావించిన దొంగలు ఆ దారి నుంచి లోపలికి చొరబడి పాఠశాల గదుల తాళాలను పగులగొట్టి చోరికి తెగబడ్డారు. కంప్యూటర్ ల్యాబ్‌లో నుంచి విలువైన కంప్యూటర్ పరికరాలు, ఫ్యాన్లు, క్రీడా సామాగ్రిని అపహరించారు. పాఠశాలలు తిరిగి సోమవారం ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు, స్కూల్‌కి రాగా తాళాలు పగులగొట్టి కనిపించాయి. అవాక్కయిన ఉపాధ్యాయులు, విద్యార్థులు లోపలికి వెళ్లి గమనించగా కంప్యూటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, క్రీడా సామాగ్రి, ఇతర పరికరాలు కనిపించ లేదు. వెంటనే ప్రధాన ఉపాధ్యాయుడు మల్లారెడ్డి స్పందించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలను పోలీసులు సందర్శించి దొంగతనం చేసిన పలు ఆధారాలను సేకరించారు. ఆదివారం సెలవు దినం కావడంతో దొంగలు స్కూల్లోకి చొరబడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా విచారణకు వచ్చారు. విషయాన్ని పోలీసులు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. విద్యార్థుల ద్వారా దొంగతనం విషయం బయటకు వచ్చింది. పోలీసుస్టేషన్‌కు ఇరువైపులా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పాఠశాలలో చోరీ చర్చనీయాంశంగా మారింది.