క్రైమ్/లీగల్

ఉత్తరాఖండ్ మాజీ సీఎంపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణపల నేపథ్యంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై సీబీఐ అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతోందన్న విషయం 2016లో రికార్డు చేసిన ఓ వీడియోలో స్పష్టమైంది. అప్పట్లో జార్ఖండ్ రాష్టప్రతి పాలన కింద ఉండగా, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి రప్పించడానికి రావత్ ప్రయత్నించారు. ఆ సమయంలోనే ‘హార్స్ ట్రేడింగ్’ ఉదంతం సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యేలను ఎంతెంత మొత్తాలకు కొనుగోలు చేయాలనే విషయాన్ని రావత్ చర్చిస్తున్నట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీనిపై నమోదైన పిటిషన్ల ఆధారంగా కేసును విచారించే బాధ్యతను సీబీఐకి అప్పగించారు. ప్రాథమిక విచారణ అనంతరం రావత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.