క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో నిర్మాత బండ్ల గణేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, అక్టోబర్ 23: కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేష్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈనెల 4న బండ్ల గణేష్ తన అనుచరులతో వైసీపీ నేత, నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఇంటిలో హంగామా సృష్టించాడు. జూబ్లీహిల్స్ పోలీసులను పీవీపీ ఆశ్రయించగా గణేష్‌పై కేసు నమోదు అయింది. దీంతో పాటు కడపకు చెందిన ఓ వ్యక్తి అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా గణేష్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్న బండ్ల గణేష్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. గణేష్‌ను విచారించిన అనంతరం 41 సీఆర్‌పీ నోటీసులు జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు.