క్రైమ్/లీగల్

గర్భిణి హత్య కేసులో కీలక సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, ఫిబ్రవరి 11: గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం సృష్టించిన గర్భిణి హత్య కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దిఖ్ నగర్‌లో నివాసముంటున్న మహారాష్టల్రోని నాగ్‌పూర్ వాసిగా పోలీసులు భావిస్తున్నారు. గర్భిణీని 28వ తేదీ ఆదివారం హత్య చేసి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 28వ తేదీ ఆదివారం హత్య చేసిన నిందితుడు 29 ఉదయం 3.27 గంటలకు యమహా మోటార్ సైకిల్‌పై మృతదేహం మూటలను మహిళ సహాయంతో కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ సమీపంలో పడవేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య వెనుక మరో మహిళ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహన్ని తరలించే సమయంలో మృతదేహం మూటలను పట్టుకుని మోటార్ సైకిల్‌పై వెళ్తున్న దృశ్యాలను పోలీసులు సేకరించారు. ఏపీ 10ఏఎల్ 9947 నంబర్ ఉన్న యమహా మోటారు సైకిల్‌పై మృతదేహాన్ని తరలించినట్లు పోలీసులు గుర్తించారు. మోటారు సైకిల్‌పై గచ్చిబౌలి, అంజయ్య నగర్ మియాపూర్ తదితర ప్రాంతాలలో సంచరించగా పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించినట్లు ఆధారాలు సేకరించారు. యమహా మోటార్ సైకిల్ నగరంలోని బౌద్దనగర్ ఆనంద్ ఉటీర్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మోటార్‌సైకిల్‌ని గతంలో నగరానికి చెందిన వ్యక్తి నాగ్‌పూర్ వాసికి విక్రయించినట్లు సదరు వ్యక్తి చెప్పినట్లు తెలిసింది. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించినప్పటికీ అతడు పరారీలో ఉండడంతో గాలిస్తున్నారు.
సీసీ ఫుటేజే కీలక సమాచారం
మహిళ హత్య కేసులో బొటానికల్ గార్డెన్‌ని అనుకుని ఉన్న వైన్ షాపు సీసీ ఫుటేజీతో కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులకు 29తేదీ ఉదయం మూడున్నర గంటల తరువాత యమహా మోటార్ సైకిల్ బొటానికల్ గార్డెన్ నుంచి వచ్చి శ్రీరాంనగర్ వైన్ షాపు ముందు యూటర్న్ చేసుకుని వెళ్లినట్టు కనబడింది. దాని ఆధారంగా బొటానికల్ చౌరస్తా నుంచి కొత్తగూడ, టెక్ మహేంద్ర, అనంతరం సిద్ధిక్ నగర్‌లోని పలు హస్టళ్ల కెమెరాలో నిందితుల పూటేజ్‌ను పోలీసులు గుర్తించారు. హత్య సిద్ధిక్ నగర్‌లో జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అంజయ్యనగర్, సిద్ధిక్ నగర్‌లపై దృష్టిపెట్టారు. మృతురాలి ఊహ చిత్రాలను విడుదల చేసి ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించారు.

రేషన్ బియ్యం పట్టివేత
కీసర, ఫిబ్రవరి 11: రీసైక్లింగ్ చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే అహ్మద్‌గూడ గ్రామంలోని శ్రీదత్తసాయి రైస్‌మిల్లులో రీసైక్లింగ్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నిల్వ ఉంచిన 100 టన్నుల రేషన్ బియ్యం, లారీ, రెండు టాటా ఏస్ వాహనాలు, ముగ్గురు నిదింతులను అదుపులోకి తీసుకున్నారు. కేసును కీసర సీఐ సురేందర్ గౌడ్ దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థుల సెల్‌ఫోన్లు మాయం
సనత్‌నగర్, ఫిబ్రవరి 11: పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థుల సెల్‌ఫోన్లు మాయమైనాయి. మేడ్చల్‌లోని సీఎంఆర్‌టీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఓ వ్యక్తి వద్ద సెల్‌ఫోన్లను ఉంచి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి సదరు వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ ఘటనలో 200 మంది విద్యార్ధులు తమ ఫోన్లను పోగొట్టుకున్నారు. చాలాసేపు కళాశాల పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆ వ్యక్తి ఆచూకీ లభ్యం కాకపోవడంతో బోరుమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రాల నెపంతో దాడి
సనత్‌నగర్, ఫిబ్రవరి 11: మంత్రాలు చేస్తుందన్న నెపంతో మహిళపై దాడి చేసిన సంఘటన బోరబండలో చోటుచేసుకుంది. బోరబండలోని ఓ ఇంట్లో రామాదేవి అద్దెకుంటుంది. ఆమె భర్త లేని సమయంలో యజమానులు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో బాధితురాలు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితురాలు పేర్కొంది.