క్రైమ్/లీగల్

భద్రత కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని కథువా గ్యాంగ్‌రేప్ బాధితురాలి కుటుంబానికి భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కేసు విచారణను చండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధితురాలి తండ్రి చేసిన అభ్యర్థనపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని సుప్రీం స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన కథువా గ్యాంగ్‌రేప్, హత్య కేసులో జమ్మూకాశ్మీర్ పోలీసుల నిర్వహిస్తున్న దర్యాప్తుపై బాధితురాలి తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కేసు విచారణ సీబీఐకి అప్పగించాలన్న పలువురి డిమాండ్‌ను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఢిల్లీకి చెందిన న్యాయవాది అంజూ కపూర్ కేసును సుప్రీం కోర్టే విచారించాలని పిటిషన్ వేశారు. అలాగే కథువా బాధితురాల తరఫునవాదిస్తున్న తనకు ప్రాణహాని ఉందని, బెదిరింపులు వస్తున్నాయని రజావత్ అనే న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబం తరఫున దీపికా సింగ్ రజావత్, వారి కుటుంబానికి సన్నిహితుడైన తాలిద్ హుస్సేన్‌కు పూర్తి భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బాధితురాలి తండ్రి అభ్యర్థన మేరకు కేసు విచారించేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఏఎం ఖన్వీకర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం అంగీకరించింది.