క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో గుట్కా వ్యాపారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తచెరువు, ఏప్రిల్ 17 : క్యాన్సర్‌కు కారణమనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను కొత్తచెరువు కేంద్రంగా గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా వ్యాపారం కొనసాగిస్తున్న విషయం విదితమే. గతంలో సైతం కొత్తచెరువులో భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నా గుట్కా వ్యాపారస్తులలో మార్పు రాకపోగా మరింత విస్తృతంగా వ్యాపారం సాగిస్తున్నారు. కర్నాటకలోని బాగేపల్లిలో నిల్వ వుంచి అక్కడి నుంచి కొత్తచెరువుకు తీసుకువచ్చి ఇక్కడి నుంచి జిల్లాలోని ప్రముఖ పట్టణాలకు గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. మంగళవారం సమాచారం అందుకున్న పోలీసులు గుట్కా వ్యాపారస్తుల ఇళ్లపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఇంకా నిర్దారించ లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లు పోలీసులకు లభ్యమైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గుట్కా వ్యాపారాన్ని నిషేధించినా ప్రస్తుతం ఏ అంగళ్ళలో చూసినా గుట్కా ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. గుట్కా వ్యాపారస్తులకు కొందరు సహకారం అందించడం వలనే ఈ వ్యాపారం కొనసాగుతున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు అధికారులు స్పందించి గుట్కా వ్యాపారంపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో దొరికిన వారే మళ్ళీ దొరుకుతుండడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడమే కారణంగా తెలుస్తోంది. పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఒక వ్యాపార సముదాయంలో గుట్కా నిల్వలు వున్నా పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇప్పటికైనా పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.