క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 17: మండలంలోని జింగలపాల్యెం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసుల కథనం మేరకు మండలంలోని కుంటిపూడి గ్రామానికి చెందిన వినోద్ (20) శ్రీకాళహస్తి నుంచి స్వగ్రామానికి మోటారు సైకిల్‌పై వెళుతుండగా, మండలంలో ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన లక్ష్మయ్య (40), శివయ్య (42) మోటారు సైకిల్‌పై స్వగ్రామానికి వెళుతుండగా జింగిలిపాల్యెం గ్రామ సమీపంలో విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీ వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు గాయపడ్డవారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యం చేయించి తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మయ్య మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలున్నారు. శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.