క్రైమ్/లీగల్

రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 7: రాష్ట్రంలో నెలకొన్న ఉల్లి సంక్షోభంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఉల్లి అక్రమ నిల్వలపై విజిలెన్స్ శాఖ కొరడా ఝలిపిస్తోంది. రాష్టవ్య్రాప్తంగా ఉల్లి వ్యాపారులపై దాడులకు శ్రీకారం చుట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ జనరల్ కేవీ రాజేంద్రనాధ్‌రెడ్డి ఆదేశాలతో రాష్టవ్య్రాప్తంగా 70మంది వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు విస్తత్ర దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాష్ట్రంలో 47మంది వ్యాపారులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. కొందరు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫీజు ఎగవేయగా, మరికొందరు అక్రమంగా ఉల్లిపాయలు పెద్ద ఎత్తున నిల్వ ఉంచినట్లు నిగ్గు తేల్చారు.
ఈ దాడుల్లో సుమారు 27 లక్షలు విలువ చేసే 603 క్వింటాళ్ల ఉల్లిపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఉల్లి కొరత సృష్టించి అక్రమ నిల్వలకు పాల్పడిన 10మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. మరో 37 మంది వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించిన విజిలెన్స్ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ నెలాఖరు వరకు హోల్‌సేల్ వ్యాపారులు 50 మెట్రిక్ టన్నులు, రిటైలర్లు 10 మెట్రిక్ టన్నులు మాత్రమే నిల్వ ఉంచాలని హెచ్చరించారు. ఈ దాడులు రాష్టవ్య్రాప్తంగా కొనసాగుతాయని ఈ సందర్భంగా విజిలెన్స్ డీజీ స్పష్టం చేశారు.