క్రైమ్/లీగల్

జడలు విప్పుకున్న ర్యాగింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లోనూ, ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ బూతం జడలువిప్పుకున్నా ఉన్నత విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అదేదో సంబంధిత విద్యాసంస్థలకు పరిమితమైనట్టు మండలి అధికారులు వౌనం వహించగా, కేవలం సర్క్యులర్లను జారీచేసి విద్యాశాఖ చేతులు దులుపుకుంది. ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలో తూతూ మంత్రంగా ర్యాగింగ్ నిరోధించాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేయడం, తర్వాత దానిపై ఎవరికీ పట్టింపు లేకపోవడంతో ఫిర్యాదు చేసేందుకు సైతం జూనియర్ విద్యార్థులు భయపడుతున్నారు. ప్రతి విద్యాసంస్థ సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలని, ప్రకటనలు, కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని, విద్యార్ధులకు వర్కుషాప్‌లను నిర్వహించి కౌనె్సలింగ్ ఇవ్వాలని , అదే విధంగా మానసిక మనోనిబ్బరానికి విద్యార్ధులకు చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలనే నిబంధనలు ఉన్నా ఏ విద్యాసంస్థ పట్టించుకోవడం లేదు. ప్రతి విద్యాసంస్థలో అధ్యాపకులు, ఉపాధ్యాయులతో యాంటి ర్యాగింగ్ కమిటీలను నియమించాల్సి ఉంటుంది. ర్యాగింగ్ కింద వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించినపుడు దానిపై అన్ని వర్గాలూ సంతృప్తి వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఇన్ని నిబంధనలు ఉన్నా ఎవరికీ పట్టడం లేదు. జేఎన్‌టీయూలోనూ ఇదే తరహా ఘటనలో బాధితుడిపైనే అధికారులు చర్యలు తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పతున్నారని ఫిర్యాదు చేస్తే వ్యవహారం వెలుగు చూస్తుందనే భయంతో జేఎన్‌టీయూహెచ్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ జూనియర్ విద్యార్థిపైనే చర్యలు తీసుకున్నట్టు వార్తలు రావడంతో మిగిలిన జూనియర్లు భయకంపితులయ్యారు. ఇదే తరహా ఘటనలు మరికొన్ని విద్యాసంస్థల్లో జరుగుతున్నా ఎక్కడికక్కడ గుట్టుచప్పుడు కాకుండా తొక్కిపెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.