క్రైమ్/లీగల్

రాష్ట్రంలో తగ్గిన తీవ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: దేశ వ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2017 సంవత్సరంతో పోల్చితే 2018లో హింసాత్మక సంఘటనలు 8.3 శాతం, మరణాలు 8.7 శాతం తగ్గాయి. హింసాత్మక సంఘటనలు 908 నుంచి 833కు తగ్గాయి. అదే విధంగా మరణాలను విశే్లషిస్తే 263 నుంచి 240కు తగ్గాయి. మావోయిస్టు పార్టీ నక్సలైట్ల గాలింపు చర్యలు, ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాల్లో మృతుల సంఖ్య 10.7 శాతం తగ్గింది. 2017లో 75 మంది పోలీసులు, 2018లో 67 మంది పోలీసులు మరణించారు. అదే సమయంలో ఎదురుకాల్పుల్లో మరణించిన నక్సలైట్ల సంఖ్య పెరిగింది. 2017లో 136 మంది మరణిస్తే, 2018లో 225 మంది మరణించారు. నక్సలైట్లలో మృతుల సంఖ్య 65.4 శాతం పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 2018లో 13 హింసాత్మక ఘటనలు జరిగాయి. వివిధ ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీలో 21 మంది సభ్యుల్లో 11 మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారున్నా, ఈ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను నిర్మూలించడంలో రాష్ట్రప్రభుత్వం సఫలమైంది. దేశం మొత్తం మీద చత్తీస్‌గఢ్‌లో ఎక్కువగా వామపక్ష తీవ్రవాదుల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 2018లో 392 హింసాత్మక సంఘటనలు ఈ రాష్ట్రంలో నమోదయ్యాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే హింసాత్మక సంఘటనలు 8.3 శాతం, మరణాల సంఖ్య 8.7 శాతం తగ్గాయి. 2018లో మొత్తం 153 మంది మరణించారు. జార్కండ్ రాష్ట్రంలో 205 సంఘటనల్లో 43 మంది, బిహార్‌లో 59 సంఘటనల్లో 15 మరణాలు, ఒడిశాలో 75 సంఘటనల్లో 12 మంది, మహారాష్టల్రో 75 సంఘటనల్లో 12 మంది మృతి చెందినట్లు కేంద్రహోంమంత్రిత్వశాఖ పేర్కొంది. దేశం మొత్తం మీద జరిగిన నక్సలైట్ల హింసాకాండలో 71.7 శాతం సంఘటనలు చత్తీస్‌గఢ్,జార్కండ్ రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 2018లో 60 జిల్లాల్లో నక్సల్స్ దుశ్చర్యలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 జిల్లాల్లో 2/3 వంతు కేసులు చోటు చేసుకున్నాయి. 2009-14 సంవత్సరాలతో పోల్చితే 2014-2019 మధ్య దేశంలో నక్సలైట్ల హింసాత్మక సంఘటనలు 43 శాతం తగ్గుముఖం పట్టాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న జిల్లాల్లో వివిధ అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం గత ఆరేళ్లుగా సాలీనా రూ.1000 కోట్లను కేటాయించి ఖర్చుపెడుతోంది.