క్రైమ్/లీగల్

ఎదురుకాల్పుల్లో మరో సైనికుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, నవంబర్ 8: కాశ్మీర్‌లో ఎదురుకాల్పుల్లో భారత్‌కు చెందిన మరో సైనికుడు మృతి చెందాడు. నియంత్రణ రేఖను దాటి చొరబాట్లకు యత్నిస్తున్న ఉగ్రవాదుల అలికిడిని గమనించి భద్రతా దళాలు కాల్పులకు దిగాయి. పరస్పర కాల్పుల్లో సెపో రాసుల్ నైరు సులగేకర్ అనే సైనికుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లా కిష్ట్ర గతి సెక్టార్‌లో చోటుచేసుకొంది. కాల్పుల్లో గాయాలైన సులగేకర్‌ను సమీపంలోని మెడికల్ క్యాంప్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ‘పాక్ ఆర్మీ కాల్పుల విరమణను ఉల్లంఘించడమే కాకుండా ఉగ్రవాదులను ప్రేరేపిస్తోంది.. కృష్ణ గతి సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి అనుమానాస్పదంగా సంచరిస్తున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను గమనించిన భద్రతా దళాలు కాల్పులు ప్రారంభించాయి.. కాల్పుల్లో సులగేకర్‌కు గాయాలైన మిలిటరీ వైద్య శిబిరానికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడు’ అని రక్షణ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. మృతుడు సులగేకర్ స్వగ్రామం కర్నాటకలోని బెల్గవి జిల్లా ఉచగావ్ గ్రామం. ఈయనకు తల్లి ఉన్నారు. ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తిని భారత ఆర్మీ కోల్పోయిందని.. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సులగేకర్ సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.