క్రైమ్/లీగల్

పోలవరం ‘హైడల్’ పనులు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 8: పోలవరం పనులకు మరోసారి బ్రేక్ పడింది. హైడల్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాదనలు కూడా వినాల్సి ఉందని పేర్కొంటూ అథారిటీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. తొలుత విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని హైకోర్టు భావించినా ప్రాజెక్టులో ఆలస్యం జరగకుండా ఉండేందుకు సోమవారానికల్లా జెన్‌కో నుంచి పూర్తి స్ధాయి నివేదికతో తాము సిద్ధంగా ఉంటామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలియచేసింది. దీంతో కోర్టు అంగీకరించి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం హెడ్ వర్క్స్, విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి నవయుగ కంపెనీ కాంట్రాక్టును దక్కించుకుంది. అయితే కాంట్రాక్టు రద్దు చేస్తూ ప్రాజెక్టుకు సంబంధించి రూ.3216 కోట్ల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టు, హెడ్ వర్క్స్‌కు సంబంధించి ఈ ఏడాది ఆగస్టు 17న ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై నవయుగ హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ బెంచి నవయుగకు అనుకూలంగా స్టే ఇచ్చింది. సింగిల్ బెంచి ఉత్తర్వులపై ప్రభుత్వం డివిజన్ బెంచిను ఆశ్రయించగా విచారణ
అనంతరం స్టే ఎత్తివేయడంతో ప్రభుత్వానికి లైన్ క్లియిరైంది. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులతో పోలవరం ప్రధాన డ్యామ్, జల విద్యుత్ ప్రాజెక్టు పనులను దక్కించుకున్న మేఘా కంపెనీకి పనులు ప్రారంభించేందుకు ఆటంకాలు తొలగినట్లు భావిస్తున్న తరుణంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తాజా నిర్ణయంతో పోలవరం పనులకు మళ్లీ బ్రేక్ పడినట్లైంది.