క్రైమ్/లీగల్

మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 8: రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా అతిక్రమించి సాగు, రవాణాకు పాల్పడితే వారి జీవితం జైలుకే పరిమితమయ్యేలా చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మత్తుపదార్థాల అక్రమ రవాణాపై దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నాతాధికారులతో శుక్రవారం వర్క్‌షాపు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సవాంగ్ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడేవారి వివరాలను డేటాలో నిక్షిప్తం చేస్తామన్నారు. ఆయా శాఖల అధికారులందరికీ ఆ సమాచారాన్ని పంపుతామన్నారు. దీంతో ఈ రకమైన స్మగ్లింగ్ అరికట్టవచ్చన్నారు. అదేవిధంగా రవాణా చేసే వారి పట్ల పీడీ యాక్ట్ కుడా ప్రయోగించాలన్నారు. గంజాయి, తదితర మత్తు పదార్థాలు రవాణా చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు వీటికి బానిసలుగా వారి జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని సూచించారు.
టోల్‌గేట్ల వద్ద సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించుకోవడం ద్వారా అక్రమ రవాణా అరికట్టేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. సరిహద్దు రాష్ట్రాలు మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని, గంజాయి ఎక్కువగా బస్సులు, కంటైనర్లలోనే సరఫరా చేస్తున్నారని, డ్రోన్‌లు, రిమోట్ సెన్సింగ్‌లను వినియోగించి రవాణాపై ప్రత్యేక దృష్టిపెడితే రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా జరగదన్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని, అదేవిధంగా మత్తు పదార్థాల నివారణ పట్ల ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమలు చేపడతామన్నారు. అక్రమ రవాణాను అరికట్టేలా కర్ణాటక, ఆంధ్ర మధ్య చెక్‌పోస్ట్ ఏర్పాటుచేసేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు. పోలీసులు తీసుకుంటున్న మాదక ద్రవ్యాల నిర్మూలన చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీజీపీ కోరారు. ముఖ్యంగా అక్రమ రవాణా నిర్మూలించే విధంగా ఇంటలిజెన్స్, టెక్నికల్, ఆపరేషన్, న్యాయ, సోషల్ మీడియా వినియోగించుకుని ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని కఠినంగా వ్యవహరించి దక్షిణాది రాష్ట్రాల అధికారులను సమన్వయం చేసుకుంటే అక్రమ రవాణాను రాష్ట్రంలో అరికట్టవచ్చన్నారు.