క్రైమ్/లీగల్

మిరప చేనులో గంజాయి సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, నవంబర్ 10: మిరప చేనుకు గంజాయ ఘాటు తగిలింది. మిరపఘాట్‌లో గంజాయ ఘాటును ఎవరూ పసికట్టలేరను కున్నారో ఏమో మిరప పంటలో గంజాయని సాగు చేస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. పదర మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామ శివారులోని మిరపచేనులో సాగుచేస్తున్న గంజాయిని అమ్రాబాద్ సీఐ బీసన్న ఆధ్వర్యంలో ఎస్సైలు రామన్‌గౌడ్,బద్రీనాథ్ తమ సిబ్బందితో ఆదివారం తనిఖీలు నిర్వహించి గంజాయిని ధ్వంసం చేశారు. సుమారు ఎకరంన్నర మిరప చేనులో మేరజ్యోత్ జగన్ అనే రైతు అంతర్‌పంటగా గంజాయిని సాగు చేస్తుండటాన్ని గుర్తించిన పోలీసులు గంజాయిని ధ్వంసం చేశారు. అతనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బీసన్న తెలిపారు.

*చిత్రం...గంజాయి పంటను ధ్వంసం చేస్తున్న పోలీసులు