క్రైమ్/లీగల్

విషాదం మిగిల్చిన ‘ఆదివారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, శ్రీకాకుళం, నవంబర్ 10: విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాద ఘటనల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. రైలు ప్రమాదంలో భార్యాభర్తలు, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వంటవారు, చేపల వేటలో ఒకరు, కళింగపట్నం సాగర తీరంలో స్నానానికి వెళ్లిన వారిలో ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఆయా ఘటనలకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో శనివారం అర్థరాత్రి నిద్రమత్తులో రైలు దిగిన భార్యాభర్తలు మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం ఎదుల్లవలస గ్రామానికి చెందిన కపరోటు వెంకటరమణారావు(48) సిఆర్‌పిఎఫ్‌లో పనిచేస్తున్నారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్ధిరపడ్డారు. రమణరావు అత్తారిల్లు విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ. భార్య నాగమణి (40)తో కలిసి అత్తవారి ఇంటికి వెళ్లేందుకు హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం రైలు ఎక్కారు. దువ్వాడలో వీరు దిగాల్సి ఉంది. అయితే దువ్వాడ వచ్చేసరికి రాత్రి ఒంటి గంట దాటిపోయింది. దువ్వాడ రైల్వే స్టేషన్ వచ్చేవరకు వీరు నిద్రలోనే ఉన్నారు. దువ్వాడలో ఆగిన రైలు మళ్లీ కదులుతుండగా మెళకువ వచ్చిన వీరిద్దరు కదులుతున్న రైలు దిగేందుకు యత్నించారు. దిగే ప్రయత్నంలో అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో రమణారావు, భార్య నాగమణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దువ్వాడ రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.
శ్రీకాకుళం జిల్లాలో...
అలాగే, శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలోని దిమ్మిడిజోల గ్రామ సమీపంలో కొత్తూరు-బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించారు. కొత్తూరు నేతాజీనగర్ కాలనీకి చెందిన అట్ల యోగేశ్వరరావు (48), కర్లెమ్మ పంచాయతీ మహాసింగికి చెందిన జోగేశ్వర పట్నాయక్ (47) భామినిలోని అయ్యప్పస్వాములు దీక్ష సందర్భంగా వంట చేసేందుకు వెళ్లారు. విందు, వివాహాలకు వంటలు చేసే వృత్తిని సాగిస్తున్న వీరిద్దరు శనివారం రాత్రి వంట పూర్తయిన తర్వాత భామిని నుంచి కొత్తూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కొత్తూరు నుంచి బత్తిలి మీదుగా ఒడిశా వెళుతున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన లారీ వీరిద్దరినీ దిమ్మిడిజోల సమీపంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బత్తిలి ఎస్ ఐ మహ్మద్ అజాద్ సంఘటనా స్థలానికి మృతదేహాలకు పంచనామా చేసి పాలకొండ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
శే్వతపుష్కరిణిలో పడి ఒకరి మృతి
శ్రీకాకుళం జిల్లా గార మండలం ప్రముఖ కూర్మనాథ క్షేత్రంలోగల స్వామివారి శే్వతపుష్కరిణిలో పడి మత్స్యకారుడు నాగుల మధుసూధనరావు(53)మృతి చెందాడు. ఆదివారం ఉదయం చేపల వేట శే్వతపుష్కరిణిలో సాగిస్తుండగా చిక్కుకున్న వలను తప్పించేందుకు ప్రయత్నంలో ఊబిలో కూరుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో మృతదేహం నీటిపై తేలింది. మృతుడు భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు హెచ్.సి. కస్పా నారాయణరావు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కి తరలించారు.